రామ్ చరణ్, వివి వినాయక్ కాంబినేషన్ లో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా కలకత్తా షెడ్యూల్ లో ఫస్ట్ లుక్ పిక్చర్స్ ని విడుదల చేసిన ఆ టీమ్ ఇప్పుడు సినిమా టైటిల్ పై దృష్టి పెడుతున్నట్లు సమాచారం. ఆ టైటిల్ గా నాయక్ అని పెడితే ఎలా ఉంటుందనే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు వినాయిక్,ఆయన నిర్మాత ఫిల్మ్ ఛాంబర్ లో టైటిల్ రిజిస్టర్ చేసినట్లు తెలుస్తోంది. అయితే ఆ టైటిల్ రామ్ చరణ్ తండ్రి చిరంజీవి 150 సినిమాకు పనికిరావచ్చు కానీ,యంగ్ హీరోకు పనికి వస్తుందా అనే సందేహాలు కొందరు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఆ మధ్య ఈ చిత్రానికి చెర్రీ అనే టైటిల్ ని కూడా పెట్టే అవకాసం ఉందని వార్తలు వచ్చాయి. చెర్రీ అనేది రామ్ చరణ్ ముద్దు పేరు.
No comments:
Post a Comment